మండనపేటలో ఘనంగా యల్లాప్రగడ జయంతి..

మండపేట (CLiC2NEWS): యల్లాప్రగడ 127 వజయంతి సందర్భంగా బుధవారం మండపేటలో జయంతి కార్య క్రమాన్ని మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏషియన్ లూయీ పాశ్చర్ గా ప్రసిద్ది కెక్కిన యల్లాప్రగడ సుబ్బారావు జయంతి కార్యక్రమాన్ని మండపేటలో ఘనంగా నిర్వహించారు. ది పీఎంపీ అసోసియేషన్ ఆలమూరు మండపేట మండలం శాఖ ఆధ్వర్యంలో ఆయన 127 వ జయంతి సందర్భంగా బుధవారం ఉషాక్లినిక్ వద్ద ఆయన చిత్ర పటానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోన సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోన మాట్లాడుతూ వైద్య రంగంలో ధృవతారగా వెలుగుతున్న సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారని అన్నారు. ఉన్నత చదువుల కోసం మద్రాసు వెళ్ళి వైద్య విద్యను అభ్యసించారని తెలిపారు. అనంతరం అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొంది మానవజాతి భవితవ్యానికి కృషి చేశారని అన్నారు. మానవజాతికి మహోపకారం చేసిన వ్యక్తుల్లో డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు ఒకరని అన్నారు. ఏషియన్ లూయీ పాశ్చర్ గా సుబ్బారావు ప్రపంచవ్యాప్తంగా కీర్తించ బడ్డారని అన్నారు. రక్త హీనత వల్ల వచ్చే వ్యాధి నిర్మూలనకు అద్భుతమైన మందు కనిపెట్టారని అన్నారు. అలాగే క్షయ రోగ నివారణకు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ ఔషధాలను కనుగొన్నారన్నారు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మొదలగు వ్యాధుల శాశ్వత నివారణకు కృషి చేసిన గొప్పా వ్యక్తి కొనియాడారు. యల్లాప్రగడ 53 సంవత్సరాల వయసులోనే మరణించినప్పటికీ ఆయన పరిశోధనల ద్వారా ఆవిష్కరించిన మందుల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి ప్రాణదాతగా నిలిచిన మహోన్నత వ్యక్తి అన్నారు. అటువంటి మహనీయున్ని స్మరించు కోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బళ్లా వెంకటరవణ, కోశాధికారి వానపల్లి కనకరాజు, మండిపూడి చంద్రశేఖర్, సుంకర బాలాజీ, నాగమణికంఠ, వివి ఎస్ డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.