రాయ్‌గఢ్ లో కూలిన భవనం

శిథిలాల కింద 70 మంది.. ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు

ముంబై: మహారాష్ట్ర రాయ్‌గఢ్‌ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మహద్ పట్టణంలో ఐదంతస్థుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద దాదాపు 70 మంది వ‌ర‌కు చిక్కుకున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఘటనలో 25 మందిని కాపాడారు. శిథిలాల కింద ఇంకా 50 మంది వ‌ర‌కు ఉంటారిని అధికారులు తెలిపారు.పూర్తి విష‌యాలు తెలియాల్సి ఉంది. ఈ భ‌వ‌నంలో 45 ఫ్లాట్లు ఉన్న‌ట్ల స‌మాచారం. ఈ ఘ‌ట‌న సోమ‌వారం సాయంత్రం 6.50 గం. ప్రాంతంలో జ‌రిగింద‌ని ఎన్డీఆర్ ఎఫ్ అధికారి వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌హారాష్ట్ర సిఎం ఉద్ధ‌వ్ ఠాక్రే స్పందించారు. అధికారుల‌తో మాట్లాడి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశాలు ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

 

1 Comment
  1. […] రాయ్‌గఢ్ కూలిన భవనం […]

Leave A Reply

Your email address will not be published.