కోహ్లీతో జాగ్రత్తగా ఉండండి : ఆరోన్ ఫించ్

అడిలైడ్ : ఆసీస్-భారత్‌ల జట్లు డిసెంబర్ 17 న అడిలైడ్ లో జరిగే డే-నైట్ టెస్ట్ లో ఎదురుపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆసీస్ జట్టు ఆటగాళ్లు జాగ్రత్త ఉండాలని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నారు. కోహ్లీ తో కలిసి ఐపీఎల్ 2020 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కలిసి ఆడిన ఫించ్ మాట్లాడుతూ… పరిమిత ఓవర్ల సిరీస్ లో మైదానంలో కోహ్లీ రిలాక్స్ గా ఉన్నాడు. కాబట్టి టెస్ట్ లో కూడా అలానే ఉండనివ్వండి. అతడిని స్లెడ్జ్ చేయడానికి ప్రయత్నించకండి అని ఫించ్ ఆసీస్ ఆటగాళ్లను హెచ్చరించాడు. అయితే తన భార్య జనవరిలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో ఈ మొదటి టెస్ట్ తర్వాత కోహ్లీ తిరిగి భారత్ కు రానున్నాడు.