రిపబ్లిక్ డే వేడుకలకు వస్తా : బోరిస్ జాన్సన్

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని బోరిస్ జాన్సన్ అంగీకరించారు. ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. 2021 రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావాలని నవంబర్ 27వ తేదీన బోరిస్ జాన్సన్‌కు మోదీ ఫోన్ చేసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నిర్వహించే జీ7 సదస్సులో పాల్గొనాలని మోదీని కూడా జాన్సన్ ఆహ్వానించారు. 27 ఏళ్ల తర్వాత రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కావడం విశేషం.