రైలుపై ప‌డిన క్రేన్‌.. 22 మంది మృతి

బ్యాంకాక్ (CLiC2NEWS): థాయ్‌లాండ్‌లో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. న‌డుస్తున్న రైలుపై క్రేన్ ప‌డిపోయిన ప్ర‌మాదంలో 22 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. బ్యాంకాక్ కి 230 కి. మీ దూరంలోని సిఖియో ప్రాంతంలో బుధ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇక్క‌డ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి.. అక్క‌డ ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్ అదుపుత‌ప్పి క‌దులుతున్న రైలు పై ప‌డిపోయింది. దాంతో రైలు ప‌ట్టాలు త‌ప్పిపోయింది. భారీ ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. వెంట‌నే స్పందించిన అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టారు. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 22 మంది మ‌ర‌ణించారు. మ‌రో 30 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాగా ప్ర‌మాద స‌మ‌యంలో రైలులో 150 మందికిపైగా ప్ర‌యాణికులు ఉన్నట్టు స‌మాచారం. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read: హైద‌రాబాద్ – విజ‌య‌వాడ హైవేపై త‌గ్గ‌ని `సంక్రాంతి` ట్రాఫిక్‌

1 Comment
  1. […] Also Read: రైలుపై ప‌డిన క్రేన్‌.. 22 మంది మృతి […]

Leave A Reply

Your email address will not be published.