విహారయాత్రలో విషాదం.. 15 మంది భారత టూరిస్టులు మృతి
Vietnam: వియత్నాం పర్యటనకు భారతీయ టూరిస్టుల(tourists)లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం భారత్ నుండి 250 మంది వియత్నాం యాత్రకు వెళ్ళారు. మూడు స్పీడు బోటులలో వీరు సముద్రంలో విహరిస్తుండగా.. ఒక బోటు బోల్తాపడి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. కడప జిల్లాకు చెందిన శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ మృతి చెందినట్లు సమాచారం.
ఓ మొబైల్ కంపెనీ భారతలోని తమ డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను వియత్నాం టూర్‌కు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది కాగా.. ఆంధ్రప్రదేవ్ నుండి 35 మంది, తెలంగాణ నుండి 40 మంది ఉన్నారు. వీరంతా మూడు స్పీడ్ బోటులలో సముద్రంలో విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో హాన్ మే రుట్ నుండి అన్‌థోయ్ పోర్టుకు ఒక స్పీడ్ బోట్ బయల్దేరింది. ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో ఈ బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బోటులో 32 మంది భారతీయులు , నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న బోటు నిర్వాహకులు సహాయక చర్యలు చేపట్టారు. కొందరిని రెస్క్యూ సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. బోటు పూర్తిగా బోల్తా పడిపోవడంతో టూరిస్టులు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. దీంతో వారిని రక్షించడం కష్టంగా మరిందని అధికారులు వెల్లడిస్తున్నారు. బాధితుల కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు వియత్నాం లోని భారత ఎంబసి పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన బోటులోని 32 మంది టూరిస్టుల జాబితాను భారత రాయబార కార్యాలయం విడుదల చేసింది.
Also Read: Sports: తొలిసారి ‘లార్డ్స్’ వేదికగా మహిళల టెస్ట్ మ్యాచ్..