కోలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
చెన్నై (CLiC2NEWS): ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. భాగ్యరాజ్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నటుడు, దర్శకుడిగానే గాక.. కథా రచయితగా, సంగీత దర్శకుడిగా కూడా ప్రజ్ఞను చాటారు. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన భాగ్యరాజ్.. భారతీ రాజా చిత్రాలకు స్క్రిప్టు రైటర్‌గా కూడా పనిచేశారు. 1979లో సువరిల్లద చిత్తిరంగల్ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. 1983లో వచ్చిన చిత్రం ముందనై ముడిచ్చు ( మూడు ముళ్లు) చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింపేర్ అవార్డును అందుకున్నారు. 2014లో సైమా జీవిత సాఫల్య పురస్కారం ఆయనను వరించింది.
Also Read: ఆర్మీ మహిళా డిగ్రీ కాలేజ్‌లో స్పాట్ అడ్మిషన్లు