Gold Prices: దిగివచ్చిన పసిడి ధర..!
Gold Rate : బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. బంగారం ధరలు (gold prices) గత కొన్ని రోజులుగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి (Silver) ధరలు తారాస్థాయికి చేరుకున్నసంగతి తెలిసిందే. దీంతో సామాన్యుడికి బంగారం కొనాలంటే అందని ద్రాక్షలా మారింది. అయితే.. గత కొన్ని రోజుల నుండి బంగారం ధరల్లో కొంత తగ్గుదల కనిపిస్తుంది. ఈ నెల మొదటి వారంలో బంగారం ధర రూ.1,53వేలు ఉండగా.. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,970కు చేరింది. శుభకార్యాలకు బంగారం కొనాలనుకునే వారు ఎప్పుడెప్పుడు ధరలు దిగివస్తాయా అని ఎదురుచూసూ వారికి ఇది నిజంగా గుడ్ న్యూసే. అదే విధంగా ఆభరణాల తయారీ బంగారం ధరలో భారీ తగ్గుతల కనిపిస్తుంది. 22 క్యారెట్ల పసిడి ధర జూన్ 30వ తేదీ నాటికి రూ.1,28,450 కి చేరింది.

ఒక నెలలో బంగారం ధరలు (gold prices) క్రమంగా తగ్గుతూ రావడం చూస్తుంటే.. బంగారం ధర తగ్గుముఖం పట్టే అవకాశం ఉండచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం ధరల్లో ఈ మార్పును పసిడి ప్రియులు ఆసక్తిగా మార్కెట్‌ను గమనిస్తున్నారు.
దేశంలో పసిడి దిగుమతులు భారీగా ఉండటంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పడుతుందని.. దేశ ప్రయోజనాల దృష్ట్యా బంగారం దిగుమతులు తగ్గించాలని , ఒక ఏడాది పాటు పసిడి దిగుమతులకు బ్రేక్ ఇవ్వాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో కొనుగోలు దారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసినట్లు ట్రేడర్లు భావిస్తున్నారు. ప్రధాని పిలుపు మేరకు దేశీయంగా కొనుగోళ్లు కొంత మందగించినా.. ఈ ధరల హెచ్చు తగ్గులనేవి అంతర్జాతీయ పరిణామాలపైనే ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.

అంతర్జాతీయ యుద్ద పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్నపుడు పెట్టుబడిదారులు బంగారంవైపు మొగ్గుచూపుతారు. దీంతో పసిడి ధరలకు రెక్కలొస్తాయి. ఉక్రెయిన్, రష్యా .. మధ్య యుద్ధం కొనసాగుతున్నపుడు కూడా పసిడి ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇది మనం గమనిస్తూనే ఉన్నాం. అదే విధంగా ఇజ్రయిల్ , గాజాపై దాడులు నేపథ్యంలో.. అమెరికా , ఇరాన్ మద్య ఉద్రిక్తల కారణంగా బంగారం ధరల్లో పెరుగుదలలు చోటుచేసుకున్నాయి. ఏదిఏమైనా బంగారం ధరల్లో తగ్గుదల అనేది కొనుగోలు దారులకు కొంత ఊరట కలిగిస్తుందనేది నిజం.
Also Read: July4.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ సేల్..