బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడితే డాక్టర్‌ను సంప్రదించాలి
-సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
కామారెడ్డి (CLiC2NEWS): బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడితే వెంటనే న్యూరో స్పెషలిస్ట్ ను సంప్రదించాలని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బిజే రాజేశ్ తెలిపారు. యశోద హాస్పిటల్ కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఓపి సెంటర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత 20 యేళ్లుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో దాదాపుగా 2000 మందికి మెదడు ఆపరేషన్లు చేశామని, ప్రస్తుతం వచ్చిన టెక్నాలజీ సహాయంతో చాలా సులభతరంగా పేషెంట్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మత్తు ఇవ్వకుండా మెదడు చికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
న్యూరోసర్జరీ విభాగంలో అత్యాధునిక సౌకర్యాలున్నాయని, ఈ సాంకేతికత వల్ల మెదడులోని పెద్ద కణితులు వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సల సమయంలోనే ఎంఆర్ఐ స్కాన్ చేసి, కణితి పూర్తిగా తొలగించబడిందా లేదా అనే విషయాన్ని వెంటనే నిర్ధారించుకోవచ్చని తెలిపారు.
కామారెడ్డి ప్రజలకు మొదటి ప్రతి గురువారం అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు, చేతులు వంకర పోవడం, పెరాలసిస్ వంటి లక్షణాలు కనబడితే వెంటనే న్యూరో స్పెషలిస్ట్ ను సంప్రదించాలని అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చాక దాదాపు మూడు గంటల లోపు చికిత్స అందినట్టయితే ప్రాణాపాయం ఉండదని తెలిపారు.
Also Read: Jailer 2: రిలీజ్ డేట్ ఫిక్స్..