Sports: తొలిసారి ‘లార్డ్స్’ వేదికగా మహిళల టెస్ట్ మ్యాచ్..
Sports News: లార్డ్స్(Lord’s) మైదానం.. ఇది లండన్ సెయింట్ జాన్స్ వుడ్‌లోని క్రికెట్ గ్రౌండ్. అక్కడ మ్యాచ్ ఆడాలనేది ప్రతి ఒక క్రికెటర్ కల. జులై 10.. శుక్రవారం భారత మహిళా క్రికెటర్లకు ఆ కల నెరవేరబోతుంది. ఇప్పటి వరకు లార్డ్స్(Lord’s) లో మహిళల టెస్టు మ్యాచ్ జరగలేదు. ఈ చారిత్రాత్మక మైదానంలో మహిళల టెస్టు క్రికెట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. రేపు ఇంగ్లాండ్ vs భారత్ మహిళల టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జట్టు కోచ్ ముజుందార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ టెస్టులో తానూ కూడా భాగం అయినందుకు ఆనందంగా ఉందన్నారు. భారత మహిళా క్రికెటర్లు కూడా ఈ అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక లార్డ్స్ మైదానంలో మన మహిళా క్రికెటర్లు సత్తా చాటాల్సి ఉంది. ఈ సందర్భంగా భారత మహిళా క్రికెటర్లు లార్డ్స్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
లార్డ్స్‌ను క్రికెట్‌కు నిలయంగా పిలుస్తారు. దీని వ్యవస్థాపకుడు థామస్ లార్డ్ పేరుతో దీనికి పెట్టారు. లార్డ్స్‌లో మొదటి వన్డే ఇంటర్నేషనల్ ODI 1972లో జరిగింది. అస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఈ మ్యాచ్ జరగగా.. అస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఈ ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మొదటి మహిళల క్రికెట్ మ్యాచ్ 1976లో జరిగింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ODI.. 60 ఓవర్లు గా జరిగింది. 1993లో ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. 2009లో మొదటి మహిళల టి20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది.