BUDGET-2023: దేశంలో పెరగను్న నర్సింగ్ కాలేజీలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో దేశవ్యాప్తంగా మెడిక్ కళాశాలలతో పాటు.. 157 నర్సింగ్ కళాశాలలకు అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. త్వరలోనే ఐసిఎంఆర్ ప్రయోగ శాలల విస్తృతిని పెంచుతామని ప్రకటించారు. ఫార్మా రంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. అలాగే వైద్య కళాశాలల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు.. అధ్యాపకులకు శిక్షణ, డిజిటల్ విధానం, జాతీయ డిజిటల్ లైబ్రరీని తీసుకురానున్నట్లు మంత్రి నిర్మలా సీతారమన్ ప్రకటించారు.
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
BUDGET-2023: లోక్సభ ముందుకు కేంద్ర బడ్జెట్
BUDGET-2023: రైల్వేలకు రూ. 2.40 లక్షల కోట్లు