కాకినాడ రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తూ.. యువతి మృతి
కాకినాడ (CLiC2NEWS): రైల్వే స్టేషన్లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తూ పట్టాలపై పడి యువతి మృతి చెందింది. విజయవాడకు చెందిన సత్య తనూషా.. గుంటూరు జిల్లా చినకాకాని ఎన్ ఆర్ ఐ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ చివరి సంవత్సం చదువుతుంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు వెళుతుండగా.. కాకినాడలో శేషాద్రి ఎక్స్ప్రెస్ దిగుతూ ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయింది. తనతోవున్న స్నేహితులు, ప్రయాణికులు వెంటనే స్పందించి చైన్లాగారు. ట్రైన్ ఆగీనప్పటికీ.. అప్పటికే ఆమె చక్రాలకింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయింది.