అమ్మపాలు.. అమృతం!
తల్లిపాలు బిడ్డకు జీవనానికి ఎదుగుదలకు ఎంతో అవసరం.కల్తీ లేనివి, శుద్ధమైనది అమ్మపాలు (బ్రెస్ట్ మిల్క్ ఇస్ ది బెస్ట్ మిల్క్.)
చనుబాలు (బ్రెస్ట్ మిల్క్) లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి
మాంసకృత్తులు
కాల్షియం
ఐరన్
విటమిన్ ఏ
దేమిన్
రైబోఫ్లోవియన్
ప్రసవించిన తల్లిపాలు తొలుతగా చిక్కగా పసుపు పచ్చ రంగులో ఉంటుంది వీటిని కొంతమంది ముద్రు పాలు అని అంటారు వాటిని పిండి వేస్తారు ఇది చాలా తప్పు దీనిని శిశువుకి తప్పకుండా పట్టించాలి ఇందులో కొలెస్ట్రోమ్ ఉంటుంది తల్లిపాల ద్వారా పిల్లల కావాల్సిన యాంటీ బాడీ లు ఇందులో దొరుకుతాయి ఇవి రోగనిరోధక శక్తి గుణాన్ని కలిగి ఉంటాయి పిల్లలు అనారోగ్యం పాలుకాకుండా ఉండాలంటే తల్లిపాలు చాలా శ్రేష్టం.
స్త్రీలు కూడా పిల్లల ఆరోగ్యం కోసం చనుపాలు తప్పకుండా ఇవ్వాలి.ఇలా ఇవ్వటం వలన మీకు మీ అందానికి హని కలుగుతుంది అని చాలా మంది స్త్రీలు పిల్లలకు చను పాలు ఇవ్వకపోవడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ రావటానికి చాలా అవకాశాలు వున్నాయి. పిల్లలకు డబ్బా పాలు తాగించడం వలన immunity power సరిగ్గా అందక రోగలబారిన పడటం జరుగుతుంది.
ప్రకృతిపరంగా సహజ సిద్దంగా స్త్రీకి వచ్చే చను పాలు బిడ్డకు అమృతం కంటే ఎక్కువగా ప్రయోజనాన్ని ఇస్తుంది.రోగనిరోధక శక్తి పెరిగి బిడ్డకు శరీరంలో ఎముకలు మరియు మెదడు ,అంగాలు,ధాతువులు చక్కగా బలాన్ని పుంజుకొని శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.తల్లి పాల ద్వారా కాల్షియం, ఫోస్పొరస్ పుష్టిగా లభిస్తుంది.
ఇప్పటికైనా శిశువులు ఆరోగ్యంగా వుండాలంటే రోగాలు త్వరగా రాకుండా వుండాలంటే తల్లి బిడ్డకు చనుబాలు ఇవ్వాల్సిందే. తల్లిపాలకు మించిన ఔషధం ఈ ప్రపంచంలో బిడ్డకు ఏదీలేదు.
మాతృదేవోభవ.
-షేక్ బార్ అలీ
యోగాచార్యులు, ఆయుర్వేద వైద్యులు
సెల్: 7396126557