ఢిల్లీ హైకోర్టులో కేజ్రివాల్‌కు దక్కని ఊరట
ఢిల్లీ (CLiC2NEWS): మద్యం కేసులో అరెస్టయిన సిఎం అరవింద్ కేజ్రివాల్ కు హైకోర్టులో ఊరట లభించలేదు. తన ను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశరు. దానిపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆయనకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. న్యాయస్థానంలో ఇడి తరపు అదనపు సొలిసిటర్ జనరవల్ ఎస్వి రాజు, కేజ్రివాల్ తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినపించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇడి అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చేనెల 3వ తేదీకి వాయిదా వేసింది.
లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 23వ తేదీన ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ ను ఇడి అరెస్టు చేసింది. రేపటితో ఆయన కస్టడి ముగియనుంది. గురవారం ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.
ఢిల్లీ మద్యం కేసు.. సిఎం కేజ్రివాల్ సతీమణి సంచలన ప్రకటన