BUDGET-2023: ఎన్నికల వేళ కర్ణాటక రాష్ట్రానికి రూ. 5,300 కోట్ల కేటాయింపులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్లో కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు అక్కడ సాగు రంగానికి రూ. 5,300 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అలాగే దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్పోరట్లు, హెలిప్యాడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు.
5 జి సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్ల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పిఎం కౌశల్ పథకం కింద 4 లక్షల మందికి శిక్షణ. దేశంలో 50 టూరిస్ట్ ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు. కొత్తగా దేఖో అప్నా దేశ్ పథకం ప్రారంభం. అలాగే స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి దేవవ్యాప్తంగా యూనిటీ మాల్స్ ప్రారంభించనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు.
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
BUDGET-2023: లోక్సభ ముందుకు కేంద్ర బడ్జెట్
BUDGET-2023: రైల్వేలకు రూ. 2.40 లక్షల కోట్లు