పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
అమరావతి (CLiC2NEWS): ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీకి వాలంటీర్లకు ఆథరైజేషన్ పత్రం తప్పనిసరి చేసింది. ఏప్రిల్, మే నెల పింఛన్ల పంపిణీకి నగదు తీసుకెళ్లే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్ పత్రం తపపనిసరి అని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) సర్క్యులర్ జారీ చేసింది. ఈ ఆథరైజేషన్ పత్రాలను ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయితీ కార్యదర్శి.. సంక్షేమ కార్యదర్శులకు ఆథరైజేషన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. పింఛను పంపిణీ సమయంలో వాలంటీర్లు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని హెచ్చరించారు. పంపిణీ చేసినట్లుగా ఫొటోలు, వీడియోలు తీయెద్దని తేల్చి చెప్పింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీవ్రంగా ఉంటాయిన సెర్ప్ సిఇఒ కార్యాలయం స్పష్టం చేసింది.