India Corona: కొత్తగా 42,766 పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది.
- ప్రస్తుతం దేశంలో 4,10,048 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 38,091 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగడా 308 మంది మృత్యువాతపడ్డారు.
- ఇప్పటి వరకు దేశంలో 4,40,533 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు.
- కరోనా రికవరీ రేటు 97.42 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని తెలిపింది.
- రాష్ట్రంలో గత 24 గంటల్లో 29,682 కేసులు నమోదవగా,
142 మంది మృతిచెందారు. - దేశంలో ఇప్పటివరకు 66.89 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది….
- కొత్తగా ప్రపంచ వ్యాప్తంగా 4,78,615 మందికి కరోనా సోకినట్లు తేలింది.
- వైరస్ ధాటికి మరో 7,752 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 221,077,480కు చేరింది.
- అలాగే మరణాల సంఖ్య 45,74,470కు పెరిగింది.
కొత్త కేసులు ఇలా..
- అమెరికా -58,682
- బ్రెజిల్- 21,804
- రష్యా- 18,780
- బ్రిటన్- 37,578
- ఫ్రాన్స్- 13,336
- టర్కీ-20,033
- ఇరాన్-20,404
- మెక్సికో-17,409