లోక్సభ బరిలో.. ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు
అమృత్సర్ (CLiC2NEWS): మాజి ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన హంతకుడు కుమారుడు లోక్సభ ఎన్నికలలో పోటీ చేయనున్నాడు. హంతకుల్లో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. 1984 అక్టోబర్ 31న ప్రధాని ఇందిరాగాంధీని ఆమె భద్రతా సిబ్బంది బియంత్ సింగ్, సత్వంత్ సింగ్ తుపాకులతో కాల్చడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం పంజాబ్లోని ఫరీద్కోట్ నియోజకవర్గం నుండి సరబ్జీత్ సింగ్ ఖల్సా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నారు. ఆయన 2004 బఠిండా స్థానం నుండి పోటి చేసి ఓడిపోయారు. రెండోసారి 2007లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ స్థానం నుండి పోటి చేసి ఓటిమి చవిచూశారు. తరువాత వరుసగా 2009,2014లో కూడా ఆయన పరాజయం పాలయ్యారు. ఆయన తల్లి బిమల్ కౌర్ ఖల్సా 1989 సార్వత్రిక ఎన్నికల్లో రోపర్ స్థానం నుండి ఎంపిగా గెలుపొందారు. అదే ఎన్నికల్లో ఆయన తాత సుచాసింగ్ కూడా బఠిండా నుండి విజయం సాధించారు.