Mandapeta: కొప్పిరెడ్డి కృష్ణకు ఎమ్మెల్సీ తోట పరామర్శ
మండపేట (CLiC2NEWS): ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన సొసైటీ డైరెక్టర్ కొప్పిరెడ్డి కృష్ణ (కిట్టయ్య)ను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరామర్శించారు. బుధవారం ఆయన మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరితో కలిసి కొండపల్లి వారి వీధిలో ఉన్న కిట్టయ్య నివాసానికి వెళ్ళి పలకరించారు. ఇటీవల ఆయన తీవ్ర రక్తపోటుకు గురై అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు కిట్టయ్య పరిస్థితిపై ఆందోళన చెంది వెంటనే రాజమండ్రి సాయి ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. వైద్యుల పర్యవేక్షణలో క్రమంగా కోలుకుని ప్రాణాపాయ స్థితి నుండి కిట్టయ్య బయట పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుని ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం మెరుగు పడి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. తోట త్రిమూర్తులు, పట్టాభిలు కిట్టయ్యతో కాసేపు ఆరోగ్యంపై మాట్లాడారు. పలకరించిన వారిలో కౌన్సిలర్ శెట్టి కళ్యాణి, 10వ వార్డు వైసీపీ ఇన్ చార్జి కొప్పిరెడ్డి పద్మావతి, వైఎస్సార్ నాయకులు పోతంశెట్టి ప్రసాద్, పిల్లా వీరబాబు, పులగం శ్రీనివాస్, శెట్టి నాగేశ్వరరావు ఉన్నారు.