Mandapeta: కార్మికులకు యూనిఫారాలు పంపిణీ
మండపేట (CLiC2NEWS): మండపేట మున్సిపల్ కార్యాలయంలో బుధవారం 50 మంది పారిశుద్ధ్య సిబ్బంది కి యూనిఫారాలు పంపిణీ చేశారు మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గ రాణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణకు పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. వేకువ జామున లేచి పట్టణాన్ని శుభ్రపరిచేది కార్మికులేనని అన్నారు. పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని అభినందించారు. కరోనా సమయంలో సైతం నిర్విరామంగా పని చేశారని అన్నారు. అన్ని కాలాల్లోనూ అలుపెరుగని ఉద్యోగ ధర్మం నిర్వహించే కార్మికులు అంటే ప్రజలకు అపార గౌరవం ఉందని పేర్కొన్నారు. కార్మికుల పని తీరు వల్లే పట్టణానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. మున్సిపల్ సిబ్బంది కి 50 మందికి యూనిఫామ్ లను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, టౌన్ వైఎస్సార్సీపీ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, కౌన్సిలర్ మెండి భవాని, వైఎస్సార్సీపీ నాయకులు యారమాటి వెంకన్న బాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.