ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న మండపేట ఎంపిడివొ రాజు
![](https://clic2news.com/wp-content/uploads/2021/08/MPDO.jpg)
మండపేట (CLiC2NEWS) : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో పటిష్టంగా అమలు పరిచినందుకు మండపేట ఎంపీడీవో ఐదం రాజుకు జిల్లాలో ఉత్తమ సేవా పురస్కారం అవార్డు లభించింది. 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రం కాకినాడలో జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ ఆయనకు ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు. ఐదం రాజు గత రెండేళ్లుగా మండపేట మండలంలో ఎన్నో కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించారు. నిజాయితీ గల అధికారిగా ఆయనకు పేరు ప్రఖ్యాతులున్నాయి. గ్రామపంచాయతీ, గ్రామ సచివాలయ వ్యవస్థల్లో ఆయన చురుకుగా ఆయా ఉద్యోగుల చేత ఎంతో సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించే విధంగా పని చేస్తున్నారు. అంతకుముందు ఆయన ఈవోపీఆర్డీ గా పనిచేశారు. గ్రామాల్లో వార్డు సభ్యుల నుండి సర్పంచ్ ల వరకు ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రతిరోజు రెండు మూడు గ్రామాలు సందర్శించి ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించడం జరుగుతుంది. ఆయనకు అవార్డు రావడం పట్ల పలువురు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.