సోమ్‌నాథ్‌లో మోడీ.. కాన్వాయ్ వెంట 108 అశ్వాలు

సోమ్‌నాథ్ (CLiC2NEWS): గుజ‌రాత్‌లోని సోమ్‌నాథ్‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. శ‌నివారం సోమ్‌నాథ్ చేరుకున్న ప్ర‌ధాని మోడీ దేవాల‌యంలో ప్ర‌త్యేక‌పూజ‌లు చేశారు. కాగా ఆదివారం ఉద‌యం కూడా సోమ్‌నాథ్ లోని మ‌హాదేవుడిని సంద‌ర్శిచి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆదివారం ఉద‌యం ఇక్క‌డ నిర్వ‌హించిన శౌర్య‌యాత్ర‌లో ప్ర‌ధాని పాల్గొన్నారు.

స్వాభిమాన్ ప‌ర్వ్‌లో భాగంగా ఈ యాత్ర‌ను నిర్వ‌హిస్థారు. ఈ సంద‌ర్భంగా సోమ్‌నాథ్ లో నిర్వ‌హించిన ప‌లు సంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.

గ‌తంలో విదేశీ దాడుల నుంచి సోమ్‌నాథ్ దేవాల‌యాన్ని ర‌క్షించే క్ర‌మంలో ప్రాణాల‌ను అర్పించిన యోధుల‌కు గుర్తుగా ఈ శౌర్య‌యాత్ర ప్ర‌తీయేటా నిర్వ‌హిస్తున్నారు. ఈయాత్ర‌లో పాల్గొనేందుకు ప్ర‌ధాని సోమ్‌నాథ్ విచ్చేయ‌డం ప్ర‌త్యేక‌త‌. దానిలో భాగంగా ప్రధాని శౌర్య‌యాత్ర‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా 108 అశ్వాలతో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న ప‌లువురుని ఆక‌ట్టుకుంది. ఈ 108 అశ్వాలు ఆల‌యం వైపు వెళ్తున్న ప్ర‌ధాని మోడీకి ఎస్కాట్‌గా మారిన‌ట్లు ఉన్న ఆ సీన్ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంది. మోడీ కి స్థానిక ప్ర‌జ‌లు `మోడీ.. మోడీ..` అంటూ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

Also Read: దారుల‌న్నీ ఊర్ల‌వైపే…

 

Leave A Reply

Your email address will not be published.