నారావారిపల్లె సంక్రాంతి సబరాల్లో సిఎం చంద్రబాబు కుటుంబం
నారావారిపల్లె (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారిపల్లెలో మంగళవారం ప్రారంభమైన సంక్రాతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేశ్, నారా బ్రాహ్మణి, దేవాంశ్, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. వాటిలో సిఎం మనవడు దేవాంశ్ పాల్గొన్నారు. ఈ పోటీలను ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు తిలకించారు. దానికి ముందు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారి పల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.