దారుల‌న్నీ ఊర్ల‌వైపే…

హైద‌రాబాద్ – విజ‌య‌వాడ హైవేపై హెవీ ర‌ద్దీ
కిలోమీట‌ర్ల‌మేర నిలిచిపోయిన వాహ‌నాలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప‌ట్నం దారుల‌న్నీ ప‌ల్లెల‌వైపు చూస్తున్నాయి.. న‌గ‌ర‌వాసి ప‌ల్లెబాట ప‌ట్టాడు.. సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో హైద‌రాబాద్ నుంచి భారీ ఎత్తు ప్ర‌జ‌లు స్వంతఊళ్ల‌కు ప‌య‌న‌మ‌య్యారు. పండుగ‌కు ముందు వీకెండ్ కావ‌డంతో ముందుగానే ప్ర‌జ‌లు గ్రామాల‌కు బ‌య‌లుదేరారు. దాంతో హైద‌రాబాద్ – విజ‌య‌వాడ హైవే పై భారీ ఎత్తున ర‌ద్దీ కొన‌సాగుతోంది.

శ‌నివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు దాదాపు 70 వేల వాహ‌నాలు ఆంధ్ర‌ప్రదేశ్‌వైపు ప‌య‌నించాయ‌ని పంతంగి టోల్ గేట్ సిబ్బంది తెలిపారు. భారీ ర‌ద్దీ నెల‌కొన‌డంతో అధికంగా టోల్ బూత్‌ల‌ను సిబ్బంది ఓపెన్ చేశారు. ఈ రోజు (ఆదివారం) మ‌రింత ఎక్కువ ర‌ద్దీ నెల‌కొనే అవ‌కాశం ఉంద‌ని వారు అంచ‌నా వేస్తున్నారు. ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జ‌రిగేందుకు త‌గిన ఏర్పాట్లు సైతం చేశారు. భారీగా వాహ‌నాలు త‌ర‌లివ‌స్తుండ‌టంతో ఎపిలోని నందిగామ వ‌ద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. దీంతో వైజంక్ష‌న్ వ‌ద్ద భారీగా ర‌ద్దీ ఏర్ప‌డింది.

Also Read: వంద‌మందికిపైగా రౌడీషీట‌ర్ల‌ను రోడ్డుపై న‌డిపించిన పోలీసులు

1 Comment
  1. […] దారుల‌న్నీ ఊర్ల‌వైపే… […]

Leave A Reply

Your email address will not be published.