ఒజి టిక్కెట్ ధ‌ర‌ల పెంపున‌కు తెలంగాణ స‌ర్కార్ గ్రీన్‌సిగ్న‌ల్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS):ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఒజి సంద‌డి మొద‌లైంది. తాజాగా తెలంగాణ స‌ర్కార్ ఒటి టిక్కెట్ల ధ‌ర‌ల పెంపున‌కు గ్ర‌నీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఒజి చిత్ర బృందం విజ్ఞ‌ప్తి మేర‌కు రేవంత్ స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చింది. ఈ మేర‌కు జివొను కూడా విడుద‌ల చేసింది.

ఈ నెల 24న రాత్రి 9 గంట‌ల‌కు ప్రీమియ‌ర్ షోకు అవ‌కాశం ఇచ్చింది. ఆ షోకు జిఎస్టీతో క‌లిపి టిక్కెట్ ధ‌ర‌ రూ. 800 .

ఈ నెల 25న సినిమా విడుద‌ల నుంచి అక్టోబ‌రు 4వ తేదీ వ‌ర‌కు టిక్కెట్ ధ‌ర‌ల పెంపున‌కు అనుమ‌తి ఇచ్చింది.

ధ‌ర‌ల పెంపు వివ‌రాలు

సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100 (జిఎస్టీతో క‌లిపి)
మ‌ల్టీఫ్లెక్స్‌ల్లో రూ. 150 (జిఎస్టీతో క‌లిపి) పెంచుకునేందుకు స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చింది. కాగా ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ టిక్కెట్ల పెంపున‌కు అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే.

Also Read: Movie news: జూ. ఎన్టీఆర్‌కు స్వ‌ల్ప‌గాయం

2 Comments
  1. […] Also Read: ఒజి టిక్కెట్ ధ‌ర‌ల పెంపున‌కు తెలంగాణ… […]

  2. […] Also Read : ఒజి టిక్కెట్ ధ‌ర‌ల పెంపున‌కు తెలంగాణ… […]

Leave A Reply

Your email address will not be published.