భార్య‌ను క‌త్తితో న‌రికిన భ‌ర్త‌

కుషాయిగూడ (CLiC2NEWS): మేడ్చ‌ల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కుషాయిగూడ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో భార్య‌ను చంపి పారిపోయిన భ‌ర్త ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు..

బోడ శంక‌ర్ (40), మంజుల (35) భార్యాభ‌ర్త‌ల స్వ‌స్థ‌లం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని మోత్కూర్ వ‌ద్ద గ‌ల అడ్డ‌గూడూర్ విలేజ్‌.. వీరికి ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె ఉంది.

20 యేళ్ల కింద‌టే వీరికి వివాహం జరిగింది. వీరు కొంత‌కాలం ముంబ‌యిలో జీవించారు. మూడేళ్ల వ‌ర‌కు వీరి దాంప‌త్య జీవితం సాఫీగానే సాగింది. త‌ర్వాత కాలంలో వీరి మ‌ధ్య అనుమానం అనే పెను భూతం వ‌చ్చింది. దాంతో కుటుంబంలో ఎప్పుడు గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉండేవి. త‌ర‌చూ శంక‌ర్ మంజుల‌ను కొడుతూ, తూల‌నాడుతూ ఉండేవాడు. భ‌ర్త పెట్టే బాధ‌లు భ‌రించ‌లేక వారం కింద‌ట మంజుల మహేష్ న‌గ‌ర్‌లో ఉన్న త‌న సోద‌రిఇంటికి వ‌చ్చింది. త‌ర్వాత శంక‌ర్ కూడా అక్క‌డి వ‌చ్చాడు. శుక్ర‌వారం పెద్ద‌ల స‌మ‌క్షంలో ఇక‌పై ఇంట్లో ఎలాంటి గొడ‌వ‌లు పెట్ట‌న‌ని, మంజుల‌ను కొట్ట‌ట‌న‌ని మాట ఇచ్చాడు. కాని అర్థ రాత్రి అంద‌రూ ప‌డుకున్న స‌మ‌యంలో మంజుల‌ను క‌త్తితో న‌రికాడు. ఆ స‌మ‌యంలో మంజుల అరుపుల‌కు అంద‌రు నిద్ర‌లేవ‌డంతో శంక‌ర్ పారిపోయాడు. కానీ అప్ప‌టికే మంజుల మృతి చెందింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఒజి టిక్కెట్ ధ‌ర‌ల పెంపున‌కు తెలంగాణ స‌ర్కార్ గ్రీన్‌సిగ్న‌ల్‌..

1 Comment
  1. […] భార్య‌ను క‌త్తితో న‌రికిన భ‌ర్త‌ […]

Leave A Reply

Your email address will not be published.