మోహన్‌లాల్‌కు ఫాల్కే
23న పురస్కారం ప్రదానం: కేంద్ర సర్కార్
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 సంవత్సరానికి గానూ మలయాళ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ ను వరించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మోహన్ లాల్ బహుముఖ ప్రజ్ఞ, ఆవిశ్రాంత కృషి ఇండియా చిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కొనియాడింది. ఈ నెల 23న జాతీయ పురస్కారాల ప్రదానంలో మోహన్ లాల్‌కు ఈ అవార్డును అందజేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఫాల్కే అవార్డుకు మోహన్ లాల్ ఎంపికైనందుకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో అద్భుతమైన పాత్రలు పోషించారని కొనియాడారు. ఆయన అద్భుత నటన భావితరాలకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని ప్రధాని కొనియాడారు.
ప్రధాని మోడీతో పాటు కేరళ సియం పినరయి విజయన్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మోహన్‌లాల్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ശ്രീ മോഹൻലാൽ ജി പ്രതിഭയുടെയും അഭിനയ വൈവിധ്യത്തിന്റെയും പ്രതീകമാണ്. പതിറ്റാണ്ടുകൾ നീണ്ട സവിശേഷമായ കലാസപര്യയിലൂടെ, മലയാള സിനിമയിലും നാടകത്തിലും പ്രമുഖ വ്യക്തിത്വമായി നിലകൊള്ളുന്ന അദ്ദേഹത്തിന്, കേരള സംസ്കാരത്തിൽ തീവ്രമായ അഭിനിവേശമുണ്ട്.തെലുങ്ക്, തമിഴ്, കന്നഡ, ഹിന്ദി സിനിമകളിലും… https://t.co/4MWI1oFJsJ pic.twitter.com/MJp4z96RlV
— Narendra Modi (@narendramodi) September 20, 2025
Also Read : ఒజి టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్‌సిగ్నల్..
[…] Also Read: మోహన్‌లాల్‌కు ఫాల్కే […]