ఆ బ్రిడ్జి కొట్టుకుపోయి ఎనిమిదేళ్లవుతుంది..
వినగడప (CLiC2NEWS): దాదాపు 20 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే బ్రిడ్జి కూలిపోయి ఎనిమిదేళ్లవుతుంది. 3 కిలో మీటర్లు వెళ్లాలంటే 30 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్తితి. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆంధ్రా-తెలంగాణ ప్రజలు ఆ రహదారిపై ప్రయాణించారు. నేడు ఆ దారి లేక నీటి ప్రవాహంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ రహదారి లేకపోతే వారికి జీవనాధారం కష్టం. నీటి ప్రవాహంలో వారి కష్టాలు వర్ణనాతీతం. చిన్నా పెద్ద తేడా లేకుండా వాగులో ప్రయాణించాల్సిందే. వాగులో రాళ్ల మధ్య అడుగు తీసి అడుగు వేయలేక వారు అవస్తలు పడుతున్నారు. కొంచెం అటు ఇటూ ఐనా.. వరద ప్రవాహానికి బలవ్వాల్సిందేనని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మా కష్టాలు ఎపుడు తీరతీయని ఎన్టిఆర్ జిల్లా తిరువూరు నియోజక వర్గంలోని వినగడప ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు , విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
Also Read: డిఎస్సి సాధించిన రోడ్డు రోలర్ డ్రైవర్‌కు టిటిఒ అభినందనలు
[…] ఆ బ్రిడ్జి కొట్టుకుపోయి ఎనిమిదేళ్ల… […]
[…] ఆ బ్రిడ్జి కొట్టుకుపోయి ఎనిమిదేళ్ల… […]