AP: ఈ నెలాఖరు వరకు వర్షాలు..!
విశాఖపట్నం (CLiC2NEWS): తెలుగు రష్ట్రాల్లో సెప్టెంబర్ నెలాఖరు వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఈ నెల 13వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ-వాయువ్య దిశాగా ఎపి, ఒడిశా , తెలంగాణ వైపు కదిలే అవకాశమున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో వార్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. మరోవైపు మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ -వాయువ్య దిశగా రాజస్థాన్, గుజరాత్ వైపు కుదులుతుందని, ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని ఐఎండి పేర్కొంది.
[…] AP: ఈ నెలాఖరు వరకు వర్షాలు..! […]