ఎల్ఐసిలో పోస్టుల‌కు ముగియ‌నున్న ద‌ర‌ఖాస్తు గ‌డువు

LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ అఫ్ ఇండియా ముంబ‌యి (LIC)లో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు ఎల్లుండితో ముగియ‌నుంది. సెప్టెంబ‌ర్ 8వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.700 గా ఉంది. ఎస్‌సి, ఎస్‌టి, పిడ‌బ్ల్యుబిడిల అభ్య‌ర్థుల‌కు ఇంటిమేష‌న్ ఛార్జెస్ రూ.85.

ప్రిలిమ్స్, మెయిన్స్‌, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ద్వారా ఎంపిక జ‌రుగుతుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు వేత‌నం రూ.88,635 – రూ. 1,65,025 వ‌ర‌కు ఉంటుంది.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటి నుండి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 21 నుండి 30 ఏళ్లు మ‌ధ్య ఉండాలి. ఒబిసి అభ్య‌ర్థుల‌కు మూడుళ్లు, ఎస్‌సి, ఎస్‌టి అభ్య‌ర్థుల‌కు 5 ఏళ్లు .. పిడ‌బ్ల్యు బిడిల‌కు 10 నుండి 15 ఏళ్లు స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీ.. అక్టోబ‌ర్ 3
మెయిన్స్ ప‌రీక్ష తేదీ .. నవంబ‌ర్8.

 

మేడ్చ‌ల్ జిల్లాలో డ్ర‌గ్స్ త‌యారీ యూనిట్‌

Leave A Reply

Your email address will not be published.