డిఎస్‌సి సాధించిన రోడ్డు రోలర్ డ్రైవర్‌కు టిటిఒ అభినందనలు
మండపేట(CLiC2NEWS): రోడ్డు రోలర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఎపి డిఎస్‌సిలో విజయం సాధించాడు. మండపేట మండలంలోని వెలగతోడు గ్రామానికి చెందిన ముల్లు సన్యాసిరావు రోడ్డు రోలర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబం కోసం పనికి వెళ్తూ కష్టపడి చదివి డిఎస్‌సి సాధించాడు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి (డిటిఒ) దేవిశెట్టి శ్రీనివాసరావు సన్యాసిరావుకు అభినందనలు తెలిపారు. పరీక్షల్లో తప్పక విజయం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాడు. కోచింగ్ సౌకర్యం లేకపోయినా, నిరాశ చెందకుండా పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో చదివి డిఎస్‌సిలో విజయం సాధించారు. డ్రైవర్‌గా పనిచేస్తూ ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని శ్రీనివాసరావు ప్రశంసించారు.
Also Read: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న చోడే కృష్ణమూర్తి
[…] […]
[…] Also Read: డిఎస్‌సి సాధించిన రోడ్డు రోలర్ డ్రైవ… […]