అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తి..
Space Tourism : అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర చరిత్ర సృష్టించనున్నారు. న్యూ షెపర్డ్ ప్రాజెక్టు పేరిట టూరిస్ట్‌గా ఆయన వెళ్లనున్నారు. 1984లో అంతరిక్షయానం చేసిన వ్యక్తి రాకేశ్ శర్మ. తర్వాత కల్పానాచావ్లా, సునీతా విలియమ్స్ , రాజా చారి, శిరీష బండ్ల అంతరిక్షయానం చేశారు. వీరంతా భారత మూలాలున్ అమెరికా పౌరులు. గోపిచంద్ అమెరికాలో ఉన్నప్పటికీ భారత పాస్‌పోర్టు ఉంది. ఆయన భారత తొలి స్పేస్ టూరిస్ట్‌గా రికార్డు సృష్టించనున్నారు. ఈ మేరకు అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు చెందిన అంరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజన్’ వెల్లడించింది.
బ్లూ ఆరిజన్ సంస్థ ‘న్యూ షెపర్డ్’ పేరిట అంతరిక్షయానం యాత్రకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్ సహా ముగ్గురు పర్యటకులు రోదసీ యాత్ర చేశారు. ఇపుడు ఎన్ ఎస్ -25 మిషన్‌కు గోపిచంద్ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేసినట్లు సమాచారం. గోపిచంద్ విజయవాడలో జన్మించాడు. ప్రిజర్వ్లైఫ్ సంస్థ సహ-వ్యవస్థాపకుడుగా ఉన్నారు. గోపిచంద్ ఎంబ్రి-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటి నుండి ఏరోనాటికల్ సైన్స్‌లో బిఎస్సి పూర్తి చేశారు. పైలట్‌గా కూడా శిక్షణ పొందారు. పదేళ్ల క్రితం భారత్‌లో మెడికల్ ఎయిర్- ఎవాక్కుయేషన్ సేవల్లో పనిచేశారు.