కోవిడ్ టీకా తీసుకుంటే మొసలిలా మారిపోతారు…

హైదరాబాద్: బ్రెజిల్ దేశాధ్యక్షుడు జెయిర్ బొల్సనారో తాజాగా మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మీరు మొసళ్లలా మారిపోవచ్చు.. ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలూ ఉన్నాయి అంటూ జెయిర్ బొల్సనారో ఈ చిత్ర విచిత్ర కామెంట్లు చేశారు. ఫైజన్-బయోఎన్‌టెక్ టీకాను తీసుకుంటే.. మనుషులు మొసళ్లలా మారే అవకాశాలు ఉన్నట్లు విమర్శలు చేశారు. కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఆయన ఈ అనుచిత కామెంట్ చేశారు. తాను మాత్రం కరోనా టీకా తీసుకునేది లేదన్నారు. ఫైజర్ కాంట్రాక్ట్ ఒప్పందంలో క్లియర్‌గా ఉందని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తో తమకు సంబంధం లేదని ఉంటుందని, మీరు ఒకవేళ మొసలిలా మారితే, అది మీ సమస్య అవుతుందని అధ్యక్షుడు బొల్సనారో సెటైర్ వేశారు. ఒకవేళ మీరు సూపర్హూమన్గా మారితే, అప్పుడు మహిళలకు గడ్డం మొలిచినా ఆశ్చర్యం లేదు, లేదా మగవాడు ఆడ గొంతుతో మాట్లాడే వీలు కూడా ఉందని, అటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌తో ఆ కంపెనీకి సంబంధం లేదని టీకా ఉత్పత్తిదారులను ఉద్దేశిస్తూ బొల్సనారో కామెంట్ చేశారు. తాము టీకాను ఉచితంగా ఇవ్వబోనున్నామని, కానీ ఆ టీకా తప్పనిసరి కాదన్నారు. తాను కూడా టీకా తీసుకోవడం లేదన్నారు.