థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుండి వలసలు నిలిపివేత: డొనాల్డ్ ట్రంప్
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయంతీసుకున్నారు. థర్డ్ వరల్డ్ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. దేశ ప్రశాంతతకు భంగం కలిగించి, మన భద్రతకు ముప్పుగా మారే వారిని బహిష్కరిస్తామని అన్నారు. అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధానికి రెండు బ్లాకుల దూరంలో బుధవారం మధ్యాహ్నం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నేషనల్ గార్డ్ కు చెందిన సభ్యురాలు ప్రాణాలు కోల్పోయింది. మరొకరు గాయపడ్డారు. ఈ నేపథ్యం అగ్రరాజ్యాధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా అధ్యక్ష భవనానికి సమీపంలో జరిగిన కాల్పులు జరిపిన నిందితుడు ఆఫ్గాన్కు చెందిన రెహ్మనుల్లా లకన్వాల్గా గుర్తించారు. అతను సిఐఎ మద్దతు ఉన్న ఆప్గాన్ ప్రత్యేక సైనిక విభాగంలో కొన్నాళ్లు పనిచేశాడు. అనంతరం అమెరికాకు వలస వచ్చినట్లు సమాచారం. దీంతో తాజాగా ట్రంప్ వలసలపై నిర్ణయం తీసుకున్నారు.
పేద దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటించారు. వలసదారులకు అన్నిరకాల ప్రభుత్వ సబ్సిడీలు, ఫెదరల్ బినిఫిట్స్ను కూడా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. పేద, అభివృద్ధి అంతగా లేని దేశాలు ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్గా పిలుస్తారు. వీటిని తక్కువ ఆదాయం కలిగిన దేశాలుగా పేర్కొంటారు. దక్షిణ సూడాన్, సోమాలియా, నైగర్, బుర్కినా ఫాసో, బురుండి, ఆప్గానిస్తాన్, మడగాస్కర్, ఇథియోపియా, లైబీరియా, పాకిస్థాన్, సిరియా , ఉగాండా వంటి దేశాలు వీటికిందకు వస్తాయి.
[…] Also Read: థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుండి వలస… […]