సైన్యం కాల్పులు: మయన్మార్లో 38 మంది మృతి
యాంగూన్: సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా మయన్మార్లో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న (ఆదివారం) దేశంలోని వివిధ ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలు జరుపుతున్న ప్రజలపై అక్కడి సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనల్లో దాదాపు 38 మంది ప్రదర్శనకారులు మరణించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తన వెల్లడించింది. యాంగోన్ ప్రాంతానికి చెందిన హంగ్తాయలో నిరసనకారులు చక్కెర కర్మాగారానికి నిప్పంటించారని… దాంతో అక్కడ సైన్యం జరిపిన కాల్పుల్లో 22 మంది మరణించారు. ఇతర ప్రదేశాలలో ప్రదర్శన జరుపుతున్న ఆందోళనాకారులపై సైన్యం జరిపిన కాల్పల్లో మరో 16 మంది మరణించారు. ఒక పోలీసు కూడా చనిపోయినట్లు తెలిసింది..