ఇంట్లో పేలుళ్లు.. 15 మంది దుర్మ‌ర‌ణం

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్ లోని ఘాజ్నీ ప్రావిన్స్ గెలాన్ జిల్లాలో‌ని ఓ ఇంట్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్ల‌లో 15 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని మీడియా సంస్థ‌లు ఈ విష‌యాన్ని వెల్ల‌డించాయి. అయితే ఈ పేలుళ్లు ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగాయా..? లేదంటే ఎవ‌రైనా ఉద్దేశ‌పూర్వ‌కంగా పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారా..? అనే వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉన్న‌ది.
‘గెలాన్ జిల్లా ఘాజ్నీ ప్రావిన్స్‌లోని ఓ ఇంట్లో అంద‌రూ గుమిగూడి ఉన్న స‌మ‌మంలో పేలుళ్లు జ‌రిగాయి. ఈ పేలుళ్ల‌లో 15 మంది మ‌ర‌ణించారు. 20 మంది గాయ‌ప‌డ్డారు’ అని ఇంటీరియ‌ర్ మినిస్ట్రీ అఫైర్స్ అధికార ప్ర‌తినిధి తారిఖ్ ఆరియ‌న్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.