మెక్సికోలో మళ్లీ లాక్‌డౌన్
మిక్సికో సిటీ: మెక్సికో దేశవ్యాప్తంగా దాదాపు 1.3 మిలియన్ల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా లక్షకుపైగా జనం మహమ్మారికి బలయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా కేసుల పెరుగుల నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధించనున్నట్లు మెక్నికన్ అధికారులు ప్రకటించారు. శనివారం నుంచి జనవరి 10వ తేదీ వరకు అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రాజధాని, శివారు ప్రాంతాల నివాసితులు స్వేచ్ఛగా తిరగటాన్ని నిషేధించలేదు. టేక్ అవుట్ సర్వీసులు, దుకాణాలు మూసివేయడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేశారు. ప్రస్తుతం మహమ్మారితో 75శాతం హాస్పిటల్స్ పడకలు నిండి ఉన్నాయని తెలిపారు. రాబోయే మూడు వారాల్లో కరోనా వ్యాప్తి, కరోనా మరణాలను తగ్గించడానికి లాక్ డౌన్ లాంటి అసాధారణ చర్యలు అవసరమని మెక్సికన్ ఉప ఆరోగ్యశాఖ మంత్రి హ్యూగో లోపెజ్ గాటెల్ పేర్కొన్నారు. మెక్సికోలో నూతన సంవత్సర ఉత్సవాల సందర్భంగా కరోనా ప్రబలకుండా నిరోధించేందుకే మళ్లీ లాక్‌డౌన్‌ను అమలు చేశారు.