344 మంది విద్యార్థుల్ని విడిచిపెట్టిన బోకోహరామ్

హైదరాబాద్: సుమారు 344 మంది స్యూల్ విద్యార్థులు నైజీరియాలో అపహరణకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆ విద్యార్థులను జిహాదీ గ్రూపు బోకో హరామ్ విడిచిపెట్టినట్లు అధికారులు చెప్పారు. గత శుక్రవారం కసినా రాష్ట్రంలోని కంకారా గ్రామంలో ఉన్న స్కూల్ నుంచి విద్యార్థులను కిడ్నాప్ చేశారు. విద్యార్థులను తామే ఎత్తుకెళ్లినట్లు మంగళవారం బోకో హరామ్ గ్రూపు ప్రకటించింది. 2014లో సుమారు 276 మంది స్కూల్ బాలికలను కూడా అపహరించింది ఈ గ్యాంగే. అయితే తాజా కేసులో ఆరు రోజుల తర్వాత ఆ విద్యార్థులను రిలీజ్ చేశారు. 344 మంది విద్యార్థులు సెక్యూర్టీ ఏజెన్సీల వద్ద ఉన్నారని, ఈ రాత్రికి కసినా రాష్ట్రానికి పంపనున్నట్లు గవర్నర్ అమినూ బెలో మసారి తెలిపారు. కిడ్నాప్ చెర నుంచి విముక్తి అయిన విద్యార్థులకు వైద్య చికిత్స అందించనున్నారు.