కామారెడ్డిలో చర్చ్ పాస్టర్ ఇంట్లో దొంగల బీభత్సం

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని సి ఎస్ ఐ వెస్లీ చర్చ్ ఫాదర్ రబిన్ సన్ వారి ఇంట్లో దొంగలు మధ్యాహ్నం సమయంలో తాళం పగలకొట్టి ఇంట్లో పెట్టి వెళ్లి నాలుగు బీరువాలు పగలగొట్టి అందులోని సామానంతా సర్ది ఇల్లు కిటికీలు తలుపులు తెరిచే పెట్టీ వెళ్లిపోయారు. కాగా సాయంకాలం వాచ్ మెన్ లక్ష్మణ్ వచ్చి లైట్ వేద్దాం అని చెప్పేసి చూసే సరికి తలుపు తీసి ఉండడం చూసి వారి కమిటీ సభ్యులకు తెలియజేయగా వారు డైల్ 100 కి కాల్ చేసి పోలీసు బృందానికి విషయం తెలియజేశారు. పట్టణ ఎస్. ఐ.రవి కుమార్, ఎస్ఐ చంద్రశేఖర్ పోలీసు బృందం వారు స్థలానికి వచ్చి వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టాస్క్ఫోర్స్ వారు రావాల్సి ఉంది.
గత సంవత్సరం క్రిస్మస్ పండగ రోజు రాత్రి ఇదే సీఎస్ఐ వెస్లీ చర్చ్ లో దొంగలు పడ్డారు. కాగా ఈ సంవత్సరం చర్చ్ లో సీసీ కెమెరాలు ఉండడంతో క్రిస్మస్ జరిగిన తెల్లవారి రోజు చర్చి ఫాదర్ ఇంట్లో ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇది కూడా మధ్యాహ్న సమయంలో జరగడంతో రోజురోజుకు దొంగల బీభత్సం పెరిగిపోతుంద‌ని ప‌ట్ట‌ణ‌వాసులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.