ఏనుగు దంతాల స్మ‌గ్లింగ్‌.. మాజి అట‌వీశాఖ ఉద్యోగిని హ‌స్తం

మైసూరు (CLiC2NEWS): రూ.2 కోట్లు విలువ చేసే ఏనుగు దంతాల‌ను త‌ర‌లిస్తున్న వారిని అట‌వీశాఖ అధికారులు న‌లుగురుని అరెస్టు చేశారు. వీరు మైసూరు ప‌రిధిలో ఏనుగు దంతాల‌ను త‌ర‌లిస్తున్నారు. వీరిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అట‌వీశాఖ మాజి ఉద్యోగిని జ‌మునా రాణి కూడా ఉన్నారు. క‌ర్నూలు జిల్లాలో అట‌వీశాఖ అధికారిణిగా ఆమె సేవ‌లందించారు. క‌ర్నూలుకు చెందిన ఆమె ముంద‌స్తు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి.. మైసూరు రామ‌కృష్ణ న‌గ‌ర్‌లో నివాస‌ముంటున్నారు. కొంద‌రు స్మ‌గ్ల‌ర్‌ల‌తో క‌లిసి ఏనుగు దంతాల‌ను విక్ర‌యిస్తున్నార‌ని అందించిన స‌మాచారంతో అధికారులు దాడులు నిర్వ‌హించి సుమారు రూ.2 కోట్ల విలువైన మూడు ఏనుగు దంతాల‌ను స్వాధీనం చేసుకున్నారు. జ‌మునా రాణితో పాటు క‌ర్నూలు జిల్లాకు చెందిన స‌య్య‌ద్ ఫ‌యాజ్‌, కొళ్లేగాల నివాసులు మునీర్ పాషా, అజ్గ‌ర్ ఖాన్‌ల‌ను అరెస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.