మోక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు..
కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మోక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ క్యాంపులో ఇసిజి, టు డిఇకొ, లిపిడ్ ప్రొఫైల్, రక్త పరీక్షలు, బిపి, షుగర్ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ క్యాంపుకు కామారెడ్డి జిల్లాలోని సుమారు 400 పైగా పేషెంట్లు హాజరై ఉచిత పరీక్షలు చేయించుకున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు భోగి రవి ప్రకటనలో తెలిపారు. మోక్ష ఆసుపత్రి వార్షికోత్సవ సందర్భంగా ఈ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఏడాది మోక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇలాంటి అవకాశం కామారెడ్డి ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు.