AP: ఉచితంగా రెటీనోపతి ఇంజక్షన్‌లు!
విశాఖ(CLiC2NEWS): నగరంలోని రామా టాకీస్ సమీపంలోని ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో డయాబెటిక్ రెటినోపతి పేరిట ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. వృద్దుల్లో , మధుమేహం అదుపులో లేని వారిలో క్రమంలో కంటిలో కీలకమైన రెటీనా రక్త నాళాలు దెబ్బతిని శాశ్వత అంధత్వానికి గురైయ్యే ప్రమాదం ఉంది. ఆ సమస్య తలెత్త కుండా కంటి నరం వాపును తగ్గించేందుకు నేత్రానికి ఇంజక్షన్ ఇస్తారు. ఈ ఇంజక్షన్ విలువ బయట మార్కెట్‌లో రూ.12వేల నుండి రూ. 13 వేల వరకు ఉంది. దీనిని ప్రైవేటు ఆస్పత్రులలో సుమారు రూ. 30 వేల నుండి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. అయితే రామా టాకీస్ సమీపంలో ఉన్న ప్రాంతీయ నేత్ర వైద్య శాలలో ఎన్‌టిఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఈ ఇంజక్షన్ చేస్తారు. ఆరు నెలల నుండి ఇప్పటి వరకు దాదాపు 500 మందికి ఉచితంగా ఈ ఇంజక్షన్ అందించినట్లు సమాచారం.