TGPSC: నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): వివిధ శాఖల్లో 290 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్ పోస్టులు, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి.
222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్ పోస్టులకు సంబంధించి జూన్ నెల 6వ తేదీ నుండి జులై 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 8 నుండి జులై 18 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.
కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్నవిరాన్ మెంటల్ ఇంజినీర్ పోస్టులు కలవు. వీటికి సంబంధించిన దరఖాస్తులను జూన్ 10వ తేదీ నుండి జులై 17వ తేదీ వరకు స్వీకరిస్తారు. పూర్తి వివరాలకు తమ అధికారిక వెబ్సైట్లో చూడగలరని టిజిఎస్సి కార్యదర్శి ప్రకటనలో తెలియజేశారు.