తెలంగాణలో కొత్తగా 472 కోవిడ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 472 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో తాజాగా ఇద్దరు మృతిచెందారు. 509 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,863కు పెరగగా, ఇప్పటి వరకు 2,76,753 మంది రికవరీ అయ్యారు. కరోనా బారినపడి 1531 మంది మృతిచెందారు. దేశంలో కోవిడ్ మరణాల శాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 95.8 శాతంగా ఏంటే రాష్ట్రంలో 97.15 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,579 యాక్టివ్ కేసులు ఉండగా… అందులో 4,426 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. గత 24 గంటల్లో 37,347 శాంపిల్స్ పరీక్షించగా 472 పాజిటివ్ కేసులు వెలుగుచేశాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 67,23,710కు పెరిగినట్టు ప్రభుత్వం పేర్కొంది.