ఎపి డిసిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు శ‌స్త్ర చికిత్స‌..

ముంబ‌యి (CLiC2NEWS): న‌గ‌రంలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్ప‌త్రిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ (Pawan kalyan)కు శ‌నివారం శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించారు. ఆయ‌న కుడి భుజానికి ఆర్ధోపెడిక్ స‌ర్జ‌న్‌, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్ట‌ర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలో స‌ర్జ‌రీ చేశారు. ప‌వ‌న్ కల్యాణ్ గ‌త కొంత‌కాలంగా భుజాల‌లో నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో చేసిన వైద్య ప‌రీక్ష‌ల‌తో ఆయ‌న భుజాల‌కు రొటేట‌ర్ క‌ఫ్ గాయాలు తీవ్ర స్థాయిలో ఉన్న ట్లు వైద్యులు గుర్తించారు. తో పాటు భుజానికి అవ‌ల్ష‌ణ్ ప్రాక్చ‌ర్ కార‌ణంగా స‌ర్జ‌రీ అవ‌స‌ర‌మైన‌ట్లు స‌మాచారం. మ‌రికొన్ని రోజుల అనంత‌రం ప‌వ‌న్ ఎడ‌మ భుజానికి కూడా స‌ర్జ‌రీ చేయ‌నున్నారు.

శ‌స్త్ర చికిత్స చేయించుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ప‌రామ‌ర్శించేందుకు ఎపి సిఎం చంద్ర‌బాబు ముంబయి వెళ్లారు. ప‌వ‌న్‌ను ప‌రామ‌ర్శించిన‌ అనంత‌రం అత‌ని ఆరోగ్యం ప‌రిస్తితిపై స‌తీమ‌ణి అన్నా కొణిదెల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మీడియ‌తో మాట్లాడుతూ.. ప‌వ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని , సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాల‌న్నారు. ఆయ‌న భుజానికి నిర్వ‌హించిన స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైంద‌ని తెలిపారు. త‌న‌కు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. సిఎం చంద్ర‌బాబుతో పాటు మంత్రులు నారాయ‌ణ‌, నాదెండ్ల మ‌నోహ‌ర్‌, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ కూడా ఉన్నారు.

Sports News: లార్డ్స్‌లో శ‌త‌కం.. తొలి మ‌హిళా క్రికెట‌ర్ య‌స్తికా భాటియా..

Leave A Reply

Your email address will not be published.