అరేపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు

భీమారం (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా భీమారం మండలం అరేపల్లి గ్రామంలో ఉచిత న్యాయ సలహా అవగాహన సదస్సు (న్యాయ విజ్ఞాన సదస్సు) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు కోర్టు జడ్జి పార్వతపు రవి హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్న చిన్న వివాదాలను కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ మార్గాల ద్వారా పరిష్కరించుకోవడానికి న్యాయ సేవా అధికార సంస్థ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం పొందే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సదస్సులో చెన్నూరు బార్ అసోసియేషన్ న్యాయవాది కాగితపు మహేష్, పున్నం, ప్రభాకర్, సంజీవ్ ,బండారి శ్రీనివాస్, మహిళా న్యాయవాదులు రమాదేవి, మమత, కోర్టు సిభంధి శృతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు వివిధ చట్టాలు, మహిళా రక్షణ చట్టాలు, భూ వివాదాల పరిష్కారాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో భీమారం సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్.ఐ) రాజేందర్ పాల్గొని గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

Also Read: చంద్రుని వైపు మానవయానం…

Leave A Reply

Your email address will not be published.