Ramagundam: కరాటే విద్యార్థులకు గిన్నిస్ రికార్డులో స్థానం

రామగుండం (CLiC2NEWS): హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఏప్రిల్ 26న లార్జెస్ట్ కరాటే గిన్నిస్ వరల్డ్ రికార్డు కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2,900 మంది విద్యార్థులు, సీనియర్ కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. వీరిలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన 1,212 మంది విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం ల‌భించింది. ఈ అరుదైన ఘనతలో పెద్దపల్లి జిల్లా రామ‌గుండం (Ramagundam)కు చెందిన జపాన్ షిటో ర్యూ కరాటే స్కూల్‌కు చెందిన 25 మంది విద్యార్థిని, విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.

ఈ సంద‌ర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యార్థులను రామగుండం (Ramagundam) పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థ‌లకు సర్టిఫికెట్లు,మెడల్స్ అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. కరాటే అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని, జీవితంలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, మానసిక ధైర్యం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే గొప్ప మార్షల్ ఆర్ట్ అని అన్నారు. ముఖ్యంగా బాలికలు స్వీయరక్షణ కోసం కరాటేను తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణిస్తూ దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మరెన్నో గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు.

Also Read: అరేపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు

Leave A Reply

Your email address will not be published.