Godavarikhani: హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం

గోదావరిఖని (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్– గోదావరిఖని(Godavarikhani) వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహించి, ఇటీవ‌ల మృతి చెందిన‌ హోంగార్డు బుట్టి శ్రీనివాస్ కుటుంబానికి సోమవారం రూ.49,000 ఆర్ధిక సాయం అంద‌జేశారు. డ్రైవ‌ర్ బుట్టి శ్రీనివాస్ అకాల మరణంతో ఒంటరైన ఆయన కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో  గోదావరిఖని (Godavarikhani), రామగుండం (Ramagundam) సబ్‌యూనిట్లలో విధులు నిర్వహిస్తున్న తోటి  హోంగార్డులు స్వచ్ఛందంగా విరాళాలు సేక‌రించారు. మొత్తం రూ.49,000లను అడిషనల్ డిసిపి (అడ్మిన్) కె.శ్రీనివాస్ సమక్షంలో శ్రీనివాస్ తల్లికి అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్థిక సాయం అందించిన హోంగార్డులను అడిషనల్ డిసిపి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ ఎసిపిలు ప్రతాప్,రమేష్,ఆర్‌ఐ (హోంగార్డ్స్) పెద్దన్న, హోంగార్డులు నాథరి శ్రీనివాస్,ఇటిక్యాల సారయ్య, వేముల మహేందర్, ఎం.డి. ఆరిఫ్, సుద్దమల్ల మల్లేష్, మీస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Also Read: Ramagundam: కరాటే విద్యార్థులకు గిన్నిస్ రికార్డులో స్థానం

Leave A Reply

Your email address will not be published.