ర‌హానే సూప‌ర్ సెంచ‌రీ.. టీమిండియాదే పైచేయి

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. తొలిరోజు ఆస్ట్రేలియాను 195 ప‌రుగుల‌కే ప‌రిమితం చేసిన టీమ్ ఇండియా రెండో రోజు బ్యాటింగ్‌లోనూ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసింది. కెప్టెన్ అజింక్య ర‌హానె (104- 200 బంతుల్లో) అజేయ శ‌త‌కానికి తోడు ర‌వీంద్ర జ‌డేజా (40-104 బంతుల్లో) నిల‌క‌డ‌గా రాణించ‌డంతో భార‌త్ ప్ర‌స్తుతం 82 ప‌రుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ క్ర‌మంలోనే ఆదివారం ఆట పూర్త‌య్యే స‌మ‌యానికి 277జ/5త‌ఓ నిలిచింది. సోమ‌వారం వీరిద్ద‌రూ ఏ మేర‌కు రాణిస్తారో వేచి చూడాలి. ‌

Leave A Reply

Your email address will not be published.