తిరుమల శ్రీవారిని దర్శించకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్
తిరుమల: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించిన అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను, పట్టువస్త్రాలను చీఫ్ జస్టిస్‌కు అందజేశారు.